రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట : ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ క్లస్టర్ బాధ్యులు, ముఖ్య నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రేణులు గ్రామాలకు వెళ్లి అందుబాటులో ఉండే వాహనాలు, సభకు వచ్చే వారి సంఖ్యను అంచనా వేస్తూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. సభకు వచ్చే వారి కోసం గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. తొలుత సభ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి (ఆర్‌ఎస్‌ఎస్) రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ
నర్సంపేట రూరల్ : బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ వాల్‌పోస్టర్లను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు మోతె జయపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోటూరి రవి, గడ్డం కొమురయ్య, కొడారి రవి, తాళ్లపల్లి రాంప్రసాద్, భూక్య వీరన్న, కడారి కుమారస్వామి, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, వల్లాల కరుణాకర్, అల్లి రవి, పెండ్యాల మునేందర్, మచ్చిక రాజు పాల్గొన్నారు.


