పారా లీగల్ వలంటీర్లకు అభినందనలు
న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ
వరంగల్ లీగల్ : ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో పనిచేయడానికి డీఆర్డీఏ, సీనియర్ సిటిజ న్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఆసక్తి చూపుతున్న పారా లీగల్ వలంటీర్లకు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్ భవన్‌లో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ ఆధ్వర్యాన డీఆర్‌డీఏకు చెందిన సోషల్ యాక్టివ్ మెంబర్స్, సీనియర్ సిటిజన్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయ సేవాధికార సంస్థల విధులు, లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఏ పౌరుడూ న్యాయాన్ని కోల్పోకుండా పారా లీగల్ వలంటీర్లు బాధ్యత తీసుకోవాలని అన్నారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్‌గౌడ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సురేశ్, డీఆర్డీఏ కార్యాలయం నుంచి జి.అనిత, ఎ.సుధాకర్, వి.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.


