ముందే హెచ్చరించిన సాక్షి
ఐపీఎల్ సీజన్ ప్రారంభసమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదలైన బెట్టింగ్ తీరుపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. యువత ఏ యాప్‌లను వాడుతున్నారు.. బెట్టింగ్ జరుగుతున్న తీరు, యువత నష్టపోతున్న వైనంపై సవివరంగా పేర్కొంది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమై బెట్టింగ్‌రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఈ నెల 4వ తేదీన గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్ టీ–20 మ్యాచ్‌లపై బెట్టింగ్‌క్యాంపుపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి చేసింది. నలుగురు నిందితుల నుంచి రూ.10,500, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 5వ తేదీన కాజీపేటలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి గోదాగు శ్రీనివాస్, గొడుగు రమేశ్, సముదాల శ్రీనివాస్, బోకరి సంతోశ్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 వేలు నగదుతో పాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 5న వరంగల్ కరీమాబాద్‌లోని ఓ ఇంటి ఆవరణలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి కరీంనగర్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.20వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 5న హనుమకొండ పీఎస్ పరిధిలో ఇటీవల పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్ ఎజెంట్ హైదరాబాద్‌కు చెందిన చింతపండు కృష్ణ, మెడిశెట్టి నరేశ్‌తోపాటు ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సుకేశ్‌ను అరెస్ట్ చేసి వారినుంచి రూ. 1.58 లక్షలు రికవరీ చేశారు. క్రికెట్ బుకీ అయిన కాకినాడకు చెందిన గడ్డం వీరమణి కుమార్‌ను అదుపులోకి తీసుకుని రూ.1.50 లక్షల నగదు, 2 సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.
...వారం రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్లపై పోలీసులు, టాస్క్‌ఫోర్స్ విసిరిన పంజా ఇది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటినుంచి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో బెట్టింగ్ జడలు విప్పింది.పోలీసులు సైతం బెట్టింగ్‌లను కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు., ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు టాస్క్‌ఫోర్స్, ఇతర ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగడంతో ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ వెలుగులోకిరాని ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దొరికిన బెట్టింగ్ రాయుళ్ల అకౌంట్లలో నగదు లావాదేవీల లెక్క తేల్చే పనిలో ఉన్నారు.
– వరంగల్ క్రైం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు బెట్టింగ్‌కు పాల్పడుతున్న నాలుగు కేసుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.42,68,300 వరకు లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తొలిసారిగా క్రికెట్ బెట్టింగ్ బుకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణికుమార్‌ను అరెస్టు చేసి, అతని బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.3.50 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటి లెక్క తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా ‘ఐపీఎల్’ జూదం
ఈ సీజన్‌లో నాలుగు కేసులు నమోదు
ముందే అప్రమత్తం చేసిన ‘సాక్షి’ వెలుగులోకి రాని ఎన్నో ఘటనలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీ అరెస్ట్ అతడి అకౌంట్లలో భారీగా లావాదేవీలు
ఈ సీజన్‌లో నాలుగు కేసులు..
u


