ప్రారంభోత్సవాలు, ఆవిష్కరణలు
వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయదేవత విగ్రహా పునఃప్రతిష్ఠ, అయోధ్య రామయ్య స్మారక వైద్య పరీక్షల కేంద్రం, ఇ–కోర్ట్స్ కేంద్రం, హనుమకొండ బార్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశ మందిరాన్ని ఉభయ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, సీహెచ్ రమేశ్‌బాబు ప్రారంభించారు. అలాగే న్యాయశాఖ ఉద్యోగుల సంఘం భవనాన్ని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో రెండు జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, కార్యదర్శులు ముదసర్ అహ్మద్, లడే రమేశ్, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.


