నేడే పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే పోలింగ్‌

Oct 9 2026 12:26 AM | Updated on Oct 9 2026 12:26 AM

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని పది డిపోలలో శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. ఆయా డీఎం కార్యాలయాల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్‌ ముగిసిన 15 నిమిషాల తర్వాత ఎక్కడికక్కడే ఓట్లను కార్మిక శాఖ అధికారులు లెక్కించి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. అయితే అధికారికంగా ఈ నెల 17న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. అందుకు గాను ఈపాటికే అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారమే ఆయా ప్రాంతాలకు బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, ఎన్నికల సామగ్రిని పంపించారు. ప్రతి డిపోలో ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. అదే శాఖకు చెందిన ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు పోలింగ్‌ ఆఫీసర్లు విధుల్లో ఉంటారు. అవసరమైన చోట అదనంగా మరొకరు సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాగా, ఆన్‌ డ్యూటీలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఆయా జిల్లాకేంద్రాల్లోని డీసీఎల్‌ కార్యాలయంలో వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ చేయనున్నారు. మరుసటి రోజు పూర్తి చేసినవి తిరిగి అందజేయాల్సి ఉంటుంది.

3,062 మంది ఓటర్లు

రీజియన్‌ పరిధిలోని పది డిపోలలో మొత్తం 3,098 మంది ఓటర్లు అర్హత సాధించినట్లు గత నెల 26న జిల్లా కార్మిక శాఖ అధికారులు ప్రకటించారు. అయితే వీరిలో కొందరు రిటైర్డ్‌ కావడంతో తాజాగా 3,062 మంది ఓటర్లుగా నిర్ధారించారు. వీరిలో మహబూబ్‌నగర్‌ డిపో పరిధిలో 410 మంది, ఆర్‌ఎం కార్యాలయ సిబ్బంది 41 మంది, వనపర్తి డిపోలో 389 మంది, గద్వాల డిపోలో 371 మంది, కల్వకుర్తి డిపోలో 354 మంది, అచ్చంపేట డిపోలో 307 మంది, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ డిపోలలో 285 మంది చొప్పున, షాద్‌నగర్‌ డిపోలో 284 మంది, కొల్లాపూర్‌ డిపోలో 226 మంది, కోస్గి డిపోలో 110 మంది ఉన్నారు. ఒక్కొక్కరు రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి (క్లాస్‌–3)లో తెలుపు రంగు, రీజియన్‌ స్థాయి (క్లాస్‌–6)లో ఆకుపచ్చ రంగులో బ్యాలెట్‌ పేపర్‌ ముద్రించారు. ఇక ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులతో గట్టి బందోబస్తు కల్పిస్తున్నారు.

రీజియన్‌లోని 10 డిపోలలో

ఓటేయనున్న 3,062 మంది

ఆన్‌ డ్యూటీలో ఉన్న వారికి 14న పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీ

15న 5 జిల్లాకేంద్రాల్లోని డీసీఎల్‌లో

అందజేతకు అవకాశం

17న అధికారికంగా తుది ఫలితాలు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement