‘బుద్దారం నిర్వాసితులకు అండగా ఉంటాం’ | - | Sakshi
Sakshi News home page

‘బుద్దారం నిర్వాసితులకు అండగా ఉంటాం’

Oct 11 2026 12:39 AM | Updated on Oct 11 2026 12:39 AM

గోపాల్‌పేట: బుద్దారం రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించాల్సిందేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం గ్రామంలో భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలో పాల్గొని మద్దుతు తెలిపి మాట్లాడారు. రిజర్వాయర్‌లో మొదటి విడత 110 ఎకరాలు, రెండోవిడత 101 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని తెలిపారు. గతంలో తాము భూములు కోల్పోయే రైతులకు చట్టపరిధిలో రూ.12 లక్షలు, దళితులకు దళితబంధు, బీసీలకు బీసీబంధు, మిగతా వారికి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధికోసం ఓ నాయకుడు వచ్చి ఎకరాకు రూ.25 లక్షల పరిహారం ఇప్పిస్తామని ప్రగల్భాలు పలికారని.. మూడేళ్ల తర్వాత అదే రూ.12 లక్షలు ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కొడంగల్‌ ప్రజలకు ఒకరకంగా.. ఇక్కడి రైతులకు మరో విధంగా పరిహారం చెల్లిస్తారా అని ప్రశ్నించారు. పొలికెపాడు శివారులో ప్రభుత్వ భూమి ఉందని.. ఇక్కడ ఒక ఎకరాకు బదులు అక్కడ మూడు ఎకరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.25 లక్షల పరిహారం చెల్లించాల్సిందేనని.. లేదంటే నిర్వాసితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement