పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

కొత్తకోట రూరల్‌: అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని.. ఇందులో భాగంగానే లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని మిరాసిపల్లికి చెందిన 11 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు (ప్రొసీడింగ్స్‌) అందజేసి మాట్లాడారు. గ్రామంలో అర్హులకు ఇళ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు సర్పంచ్‌ వైదేహితో పాటు లబ్ధిదారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

చాదర్‌ సమర్పించిన ఎమ్మెల్యే..

మండలంలోని నాంచారమ్మపేటలో సయ్యద్‌ అబ్దుల్‌ షా ఖాద్రీ దర్గా ఉర్సుకు శుక్రవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి హాజరై చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యేకు దర్గా నిర్వాహకులు, గ్రామస్తులు, కాంగ్రెస్‌ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం దర్గా సమీపంలో రూ.5 లక్షలతో నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పి.కృష్ణారెడ్డి, శరత్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ చంద్రమోహన్‌రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎన్‌జే బోయేజ్‌, బీచుపల్లియాదవ్‌, అప్పరాల సర్పంచ్‌ మాసన్న, సుభాష్‌, సాయిదాబ రాజు, ముజీబ్‌, సలీంఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement