జూరాల ప్రధాన ఎడమ కాల్వకు వారాబందీ విధానంలో నీటిని వదిలి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. కాని ఆ నీరు కాల్వల ద్వారా పంటలకు అందుతుందా లేదా అని పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కాల్వ నుంచి డీ–20 కాల్వకు నీరు సరిగా రాకపోవడంతో శనివారం రైతులు కాల్వలో ఉన్న
అడ్డుకట్టలు, నాచు, ముళ్లపొదలను తొలగించడం కనిపించింది. వారాబందీ విధానంలో నీటిని విడుదల చేయడంతో రైతులందరూ ఒకేసారి కాల్వల వెంట తిరుగుతూ పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.
– వనపర్తి రూరల్


