దసరాకి 762 ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

దసరాకి 762 ప్రత్యేక బస్సులు

Oct 11 2026 12:39 AM | Updated on Oct 11 2026 12:39 AM

సద్వినియోగం చేసుకోవాలి

● హైదరాబాద్‌ రూట్‌లోనే అధికంగా అదనపు ట్రిప్పులు

● ఈ నెల 22 వరకు ప్రత్యేక

బస్సుల నిర్వహణ

● బస్టాండ్లలో తాగునీరు, షెల్టర్లు,

కూర్చునేందుకు కుర్చీలు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: దసరా పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో ఈ నెల 9 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 762 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే, ఈ వివరాలను శనివారం అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

డిపోల వారీగా బస్సుల వివరాలు

ప్రత్యేక బస్సుల నిర్వహణలో భాగంగా ఈ నెల 9న 88, 10న 43, 11న 63, 12న 34, 13న 29, 14న 38, 15న 22, 16న 68, 17న 79, 18న 77, 19న 70, 20న 34, 21న 29 బస్సులను నడపాలని ప్రణాళిక రూపొందించారు. చివరి రోజైన ఈ నెల 22న మరో 88 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. డిపోల వారీగా నాగర్‌కర్నూల్‌ నుంచి 123, నారాయణపేట నుంచి 91, గద్వాల నుంచి 85, అచ్చంపేట, వనపర్తి డిపోల నుంచి 80 చొప్పున, మహబూబ్‌నగర్‌ నుంచి 78, షాద్‌నగర్‌ నుంచి 77, కల్వకుర్తి నుంచి 68, కొల్లాపూర్‌ నుంచి 52, కోస్గి నుంచి 28 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

హైదరాబాద్‌ రూట్‌లో అధిక ట్రిప్పులు

హైదరాబాద్‌ రూట్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ మార్గంలో అధిక సంఖ్యలో అదనపు బస్సులను నడుపుతున్నారు. ఈ మార్గం ద్వారా ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కర్నూలు రూట్‌లోనూ అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బస్టాండ్లలో అదనపు వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీరు, షెల్టర్లు, కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల వివరాలు, ప్రయాణ సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా చర్యలు చేపట్టారు.

దసరాా పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడుపుతున్నాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అనుమతి లేని ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించవద్దు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. బస్టాండ్లలో వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.

– పి.సంతోష్‌కుమార్‌,

ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement