వనపర్తి రూరల్: వనపర్తి ఆర్టీసీ డిపోలో శుక్రవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ కూటమి విజయం సాధించింది. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించగా.. విధులకు హాజరైన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు వారితో పాటు సూపర్‌వైజర్లు సాయంత్రం 6 వరకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా డిపో వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరం నిబంధన అమలులో ఉండటంతో యూనియన్ నాయకులు సున్నంతో గీసిన గీత దాటి అవతల ప్రచారం చేశారు. డిపోలో మొత్తం 389 మంది కార్మికులు ఉండగా.. 388 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి అనే కార్మికుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకోలేదు. సాయంత్రం 6 తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. టీడబ్ల్యూయూ ఈయూపై స్టేట్‌లో 132 ఓట్లు, రీజియన్‌లో 138 ఓట్ల ఆధిక్యం సాధించింది. భారీ మెజార్టీ సాధించిన టీడబ్ల్యూయూ కూటమి నాయకులు, కార్మికులు శుక్రవారం రాత్రి డిపో ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో నాయకులు చలపతిరెడ్డి, కిరణ్, రమేష్, డీబీకే రెడ్డి, నాగేష్, గోపాలకృష్ణ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ల వారీగా వచ్చినట్లు
యూనియన్ స్టేట్‌కు రీజియన్
టీడబ్ల్యూయూ కూటమి 258 262
ఈయూ 126 114
టీజేఎంయూ 3 6
బీకేయూ 1 3
ఐవైఆర్‌ఎస్ – 1
ఐఎన్‌టీయూసీ – 1
చెల్లనివి – 1


