రూ.60 కోట్లతో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రూ.60 కోట్లతో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

వనపర్తి రూరల్‌: పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో రూ.60 కోట్లతో తెలంగాణా రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని.. ఈ నెల 15న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు శంకుస్థాపన చేస్తారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం పెబ్బేరులోని హజ్రత్‌ షేక్‌ అలీషా ఉర్సు సందర్భంగా దర్గాను సందర్శించి చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామంలో సర్వేనంబర్లు 280, 281, 164లో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కేటాయించిన 40 ఎకరాల భూమిని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వరి సాగు చేస్తారని, వరితో పాటు ఇతర పంటలను సాగుచేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఏడాది కాలంలో నిర్మాణం పూర్తిచేసి రైతులు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో పంటలు సాగు చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనాత్మక అంశాలను ఇక్కడ వివరిస్తారని వివరించారు. అలాగే మూడురోజుల కిందట పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం చాలా బాధాకరమని, కలెక్టర్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్మన్‌ అక్కి శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ కురుమూర్తిసాగర్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ సుమిత్ర, మధుసూదన్‌గౌడ్‌, మండల, పట్టణ అఽధ్యక్షులు దయాకర్‌రెడ్డి, రాంరెడ్డి, నాయకులు విజయవర్ధన్‌రెడ్డి, వెంకటరత్నం నాయుడు, సురేందర్‌గౌడ్‌, వెంకటేష్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement