ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అమ్మవారు బాలత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లాకేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలోని సరస్వతిమాత ఆలయం, న్యూగంజ్‌లోని గణపతి ఆలయం, మర్రిచెట్టు బాలాంజనేయస్వామి ఆలయంలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటుచేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మర్రిచెట్టి ఆంజనేయస్వామి ఆలయ ముఖద్వారం వద్ద భారీ ఆర్చీ ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలోని వల్లభ్‌నగర్‌, రామాలయం, పాతబజార్‌, గాంధీచౌక్‌, టీచర్స్‌కాలనీ తదితర ప్రాంతాల్లో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేసిన భక్తులు పూజలు నిర్వహించి అమ్మవారి మాలలు ధరించారు.

శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో..

వనపర్తి రూరల్‌: శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆయంలో ఆదివారం అమ్మవారు ఆదిలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement