వనపర్తి: పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చిన్న జిల్లాల ఏర్పాటుకు కృషి చేసిన మాజీ సీఎం కేసీఆర్‌కు జే కొడుతూ ఆదివారం జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు కొత్త జిల్లాల దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఆరోవార్డు పీర్లగుట్ట చౌరస్తా నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా భారీ నిర్వహించారు. కొట్లాడి తెలంగాణ సాధించి పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, అవసరమైన కొత్త మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలన అందించారని ఆ పార్టీ నాయకులు వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, నందిమళ్ల అశోక్, శ్రీకర్‌గౌడ్, శ్రీనివాసులు వివరించారు. కేసీఆర్ బాటలో తమ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి రుచి చూపించారన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శిరీష, రమేష్‌గౌడ్, కవిత నాయక్, వెంకటేష్, నీలస్వామి, యాదయ్య, రంగం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


