● తాలు పేరుతో తరుగు తీస్తే చర్యలు
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పాన్‌గల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారిస్తూ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కేతేపల్లి, వెంగళాయిపల్లి, జమ్మాపూర్‌లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి పూర్తయిన వాటి గృహా ప్రవేశాలు పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం చేయకుండా ధాన్యం తూకం చేయాలని, తాలు పేరుతో తరుగు తీసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తూకంలోనూ పారదర్శకత ఉండాలని.. అధికారులు మండలానికి ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమస్యలు పోస్టు చేస్తే పరిష్కరించేలా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. దీంతోపాటు ధాన్యం తరలించే లారీలకు జియో ట్యాగింగ్ చేస్తే ఎక్కడ ఉన్నాయనే విషయం తెలుస్తుందని సూచించారు. అధికారులు రోజు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, మాజీ ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రవికుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు అనసూయమ్మ, మల్లయ్య, తహసీల్దార్ కార్తీక్‌రావు, ఎంపీడీఓ గోవిందరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


