కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాకారం

May 13 2026 12:38 AM | Updated on May 13 2026 12:38 AM

వనపర్తి రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పేదల సొంతింటి కల సాకారమవుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో 12 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశాల్లో ఆయన పాల్గొని కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. తాము శిథిల ఇళ్లలో ఉంటూ ఎప్పుడు కూలుతాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీశామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేష్‌, సర్పంచ్‌ అరుణ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఎద్దుల విజయవర్ధన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, పార్టీ మండల నాయకులు ,గ్రామపెద్దలు, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement