తెలియక వచ్చాను.. | - | Sakshi
Sakshi News home page

తెలియక వచ్చాను..

May 13 2026 12:38 AM | Updated on May 13 2026 12:38 AM

బాదేపల్లి యార్డులో మంగళవారం కొనుగోళ్లు చేయడం లేద ని తెలియక ధాన్యం తీసుకువచ్చాను. దీంతో ధాన్యం కుప్ప వద్దే పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. ముందస్తు సమాచారం తెలిసి ఉంటే బుధవారమే తీసుకువచ్చే వాడిని. రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలి.

– మధుసూదన్‌రెడ్డి, రైతు, గోప్లాపూర్‌

రైతులు సహకరించాలి..

బాదేపల్లి యార్డుకు సోమవారం ఒక్కరోజే 30 వేల బస్తాల దిగుబడులు వచ్చాయి. దీంతో బస్తాలు తూకం వేయడంలో ఆలస్యమైంది. మంగళవారం కూడా అవే బస్తాలు తూకాలు వేశాం. బస్తాల తరలింపులోనూ ఆలస్యం కావడంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని నిర్ణయించాం. ఈ విషయం రైతులు గమనించి సహకరించాలి. – అశ్వక్‌ ఆహ్మద్‌,

మార్కెట్‌ కార్యదర్శి, బాదేపల్లి

Advertisement
 
Advertisement
Advertisement