ఎస్పీ ప్రజావాణికి 12 వినతులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ ప్రజావాణికి 12 వినతులు

May 12 2026 12:38 AM | Updated on May 12 2026 12:38 AM

వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 12 వినతులు వచ్చాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిశీలించి తక్షణమే విచారించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులను ఆదేశించారు.

ప్రజల సౌలభ్యానికే

డివిజన్‌ స్థాయి ప్రజావాణి : ఆర్డీఓ

ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన డివిజనల్‌ స్థాయి ప్రజావాణికి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజల సౌలభ్యం, అర్జీల సత్వర పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణికి 10 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలలు, అధునాతన ఏటీసీ కోర్సుల్లో 2026–2028 విద్యాసంవత్సరం మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ ఇస్తేమాల్‌హక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు http://iti.telangana.gov. in వెబ్‌సైట్‌లో ఈ నెల 14 నుంచి జూన్‌ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 98492 44030, 79953 35372 సంప్రదించాలని సూచించారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో

ప్రవేశాలకు..

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (బేగంపేట, రామంతపూర్‌)లో 1వ తరగతి (డే స్కాలర్‌) ప్రవేశాలకు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధిశాఖ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019, జూన్‌ 1 నుంచి 2020, మే 31 మధ్యన జన్మించిన వారు అర్హులని, విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.2క్ష లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు పత్రాలను ఈ నెల 18న సాయంత్రం 5లోగా కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తు రూమ్‌నంబర్‌ 118లో సమర్పించాలన్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొనా ్నరు. నివాసం, కులం, ఆదాయ ధ్రువపత్రాలు మీ–సేవ ద్వారా పొందాలని.. అన్ని ధ్రువపత్రాల జిరాక్స్‌పై గజిటెడ్‌ అధికారితో అటెస్టెడ్‌ చేయించాలని సూచించారు.

ఎస్టీ గురుకులాల్లో అడ్మిషన్లు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్‌ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ నెల 16, 18 కౌన్సెలింగ్‌ నిర్వహించిన భర్తీ చేస్తామన్నారు. ధర్మాపూర్‌ వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్‌లో కౌన్సెలింగ్‌ ఉంటుదని, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లుతో హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 94909 57312, 94909 57314, 94909 57315 నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement