నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు

May 11 2026 7:20 AM | Updated on May 11 2026 7:20 AM

వనపర్తి రూరల్‌: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు వచ్చిన వరి ధాన్యం లారీలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. ఆదివారం ఆయన మండలంలోని శేరుపల్లి శివారులో ఉన్న సప్తగిరి రైసుమిల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్‌లోడింగ్‌ ప్రక్రియను కేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కొనుగోళ్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, మిల్లు యజమానులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం అన్‌లోడింగ్‌ సమయంలో ఎలాంటి తరుగు తీయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించాలని, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రైస్‌మిల్లుకు నియమించిన ప్రత్యేక అధికారి లారీల రాకపోకలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఏ ఽలారీ ఎప్పుడు వచ్చింది.. ఎప్పడు ఖాళీ అయ్యింది అనే వివరాలు అందులో నమోదు చేయాలన్నారు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రతి రైసుమిల్‌కు గ్రామపంచాయతీ అధికారులను నియమించామని.. మిల్లు వద్ద ఉండి ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చూస్తారని పేర్కొన్నారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించకూడదని, ఎక్కడైనా తరుగు పేరిట మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement