అకాల వర్షం.. తడిసిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

May 11 2026 7:20 AM | Updated on May 11 2026 7:20 AM

గోపాల్‌పేట: ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల్‌పేట మండలంలోని చాకల్‌పల్లి, ఏదుట్ల, రేవల్లి మండలంలోని గౌరిదేవిపల్లి, నాగపూర్‌, రేవల్లి, శానాయిపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

గౌరిదేవి

పల్లిలో

తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు

Advertisement
 
Advertisement
Advertisement