త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం
● పోలీస్, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు
● నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు
● విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత
‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే
స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు
ఉన్నతాధికారులు. ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల
బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం
సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని
పలువురు ఉన్నత ఉద్యోగుల
అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు...
– సాక్షి, నాగర్‌కర్నూల్/
పాలమూరు/గద్వాల
ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్‌లో కూడా రోజు హోంవర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది.
● వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. అదనపు కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఎస్సెస్సీ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, వర్క్‌షాప్‌ల ఏర్పాటు, జయశంకర్ బడిబాట కార్యక్రమం, పోషకుల సమావేశాలు, లైబ్రరీ డే, విద్యా వేడుకలను నిర్ణీత ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. అదే విధంగా జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వందశాతం పూర్తయ్యేలా ఏఈఓలకు లక్ష్యాలను నిర్దేశించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో సీపీఓ హరికృష్ణ, డీసీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్, డీఎం ఆంజనేయులు, డీఏఓ ఆంజనేయులు, డీడబ్ల్యూఓ సుధారాణి ఉన్నారు.
నేడు
మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
యువతకు స్వయం ఉపాధి అవకాశాలు
వనపర్తి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ అనిల్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్ (30 రోజులు), మగ్గం వర్క్ (30 రోజులు), సీసీ కెమెరా టెక్నిషీయన్ (13 రోజులు), ఫొటోగ్రఫి – వీడియోగ్రఫి (31 రోజులు), ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ (14 రోజులు), కొవ్వొత్తులు, అగరబత్తుల తయారీ (13 రోజులు), హౌస్ వైరింగ్ (31 రోజులు), ఎల్‌ఎంవీ కారు డ్రైవింగ్ (31 రోజులు), జనరల్ ఈడీపీ (6 రోజులు), ఎలక్ట్రిక్ మోటార్ రివైండింగ్ సర్వీసెస్ (31 రోజులు), సెల్‌ఫోన్ రిపేర్ అండ్ సర్వీసింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), రిఫ్రిజిరేటర్ – ఎయిర్ కండీషనింగ్ వర్క్ (30 రోజులు), ద్విచక్ర వాహనం మెకానిక్ (30 రోజులు), తేనెటీగల పెంపకం, తేనె తయారీ (20 రోజులు), పుట్టగొడుగుల పెంపకం (10 రోజులు) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మగ్గం వర్క్ కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ముద్రా పథకం ద్వారా రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి.. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని.. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లాకేంద్రంలోని మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 85220 88978, 98859 40945, 79816 84174 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర
ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్‌నగర్ టౌన్ ఎకై ్సజ్ ఎస్‌ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్, ఏడేళ్ల కొడుకు రోహన్ష్ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్‌వేర్ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు.


