ప్రజా పాలనలో పంట కొనే దిక్కులేదు | - | Sakshi
Sakshi News home page

ప్రజా పాలనలో పంట కొనే దిక్కులేదు

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

కొత్తకోట రూరల్‌: రైతులు వడ్ల కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శనివారం కొత్తకోటలోని శివాజీ చౌరస్తాలో రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. రైతుల పంట కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. పంట పండించేందుకు పడిన కష్టానికి మించి అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. బోనస్‌ ఇవ్వకుండా తప్పించుకునేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిచో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ వామన్‌గౌడ్‌, సీడీసీ మాజీ చైర్మన్‌ చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, మాజీ జెడ్పీటీసీ పి.విశ్వేశ్వర్‌, కౌన్సిలర్లు తిరుపతయ్య, అయ్యన్న, గాడీల ప్రశాంత్‌, ఆకుల శ్రీనివాసులు, కె.శ్రీనివాస్‌జీ, గోపాల్‌నాయక్‌, డైరెక్టర్‌ భాస్కర్‌, జలేంధర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, ఎద్దుల నాగేశ్‌, వికాస్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement