ఆత్మకూర్:కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికలోకం ఏకం కావాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు మహమూద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎన్ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజు అన్నారు. ఆత్మకూర్‌లో మేడే ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేదని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగునంగా కనీసవేతనం రూ.24వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన కార్మికులకు అన్యాయం చేసేందుకు పూనుకుంటుదని మండిపడ్డారు. కేంద్రంలో మోది ప్రభుత్వం అసంఘటితరంగ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ఎలాంటి న్యాయం చేయలేదని ఆరోపించారు. కేంద్ర, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు సమరశిల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బుచ్చన్న, సుజ్నానం, అరుణ్, రవి, నిషాంత్, భారతీయుడు, ప్రకాష్ తదితరులు ఉన్నారు.


