వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

కొత్తకోట: ప్రతి జిల్లా కేంద్రంలో వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటుచేసి.. విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం కొత్తకోటలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్‌ 2న పీఆర్సీ ప్రకటించడంతో పాటు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింహాగౌడ్‌, రవీందర్‌రెడ్డి ఆయనను శాలువాలతో సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement