● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
ఖీమ్యానాయక్
వనపర్తి రూరల్: గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో పాడి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని, పశువులకు సకాలంలో టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయించడం అవసరమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పెబ్బేరులో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మెగా ఫర్టిలిటి అండ్ హెల్త్‌క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ఇలాంటి శిబిరాలు నిర్వహించడం రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. శిబిరంలో పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా. వెంకటయ్యగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ చైర్‌పర్సన్ గౌని ప్రమోదినిరెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


