ఎత్తిపోతల మోటార్లు సరిగా పనిచేయక మా పొలాల వరకు సాగునీరు పారేది కాదు. పైపుల లీకేజీ కారణంగా ఏళ్లుగా సాగునీరు వృథా అయ్యేది. సరళాసాగర్ ఎత్తిపోతల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మా చివరి పొలాలకు కూడా సమృద్ధిగా సాగునీరు అందుతుందని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే మా కష్టాలు గుర్తించి నిధులు మంజూరు చేయించడం గొప్ప విషయం.
– శ్రావణ్‌కుమార్,
శంకరమ్మపేట, మదనాపురం
శ్రీ కురుమూర్తి, సరళాసాగర్, నెలివిడి ఎత్తిపోతల మరమ్మతుకు నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. సరళాసాగర్ ఎత్తిపోతల పంపులు కాలం చెల్లినవి కావడంతో సీజన్ మధ్యలో తరచూ మొరాయించేవి. మరమ్మతులకు నెలల సమయం పట్టేది. అప్పటికే పంటలు ఎండిపోయేవి. ప్రస్తుత ఎమ్మెల్యే మూడు ఎత్తిపోతల మరమ్మతులకు రూ.4.31 కోట్లు మంజూరు చేయించడంతో వ్యవసాయం మీద నమ్మకం పెరుగుతోంది. సాగునీరు సమృద్ధిగా అందితే అధిక దిగుబడులు సాధిస్తాం.
– హనుమాన్‌రావు, కాంగ్రెస్ నాయకుడు,
నర్సింగాపురం, మదనాపురం
కురుమూర్తిస్వామి ఆశీస్సులు, సరళాసాగర్ పుణ్యంతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి. ఎత్తిపోతల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నాం. పనులు నాణ్యతగా చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రతి చుక్క నీటిని రైతుల పొలాలకు చేర్చే బాధ్యత నాది.
– జి.మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర
●


