రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటాలి

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

వనపర్లిటౌన్‌: హైదరాబాద్‌లో ఈ నెల 17న జరగబోయే తెలంగాణ 12వ సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్‌ ఆకాంక్షించారు. గురువారం జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జిల్లా జట్టు ఎంపికలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ అథ్లెటిక్స్‌ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు జిల్లాను ఉన్నతస్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలని, పట్టుదలతో చివరి నిమిషం వరకు విజయం కోసం పోరాడాలన్నారు. ఎదురుదెబ్బను మెట్టులా చేసుకొని గెలుపువైపు పయనించాలని సూచించారు.

ఎంపికై న క్రీడాకారులు..

అండర్‌–8 బాలుర 60 మీటర్ల పరుగు విభాగంలో హార్థిక్‌, అండర్‌–10 బాలుర లాంగ్‌జంప్‌నకు లిఖిత్‌, 300 మీటర్ల పరుగు పందెంకు మహేష్‌, 60 మీటర్ల పరుగు పందెం బాలికల్లో రితిక, 300 మీటర్లు జాహ్నవి, అండర్‌–12 పరుగు పందెం బాలురలో యశ్వంత్‌రెడ్డి, షాట్‌పుట్‌ నరేందర్‌, 400 మీటర్ల పరుగు పందెం శ్రీ చరణ్‌, బాలికల 60 మీటర్ల పరుగు పందెం ఘోషిక, 400 మీటర్ల పరుగు పందెం సింధూ, అండర్‌– 16 బాలురు షాట్‌పుట్‌కు నరేందర్‌, లాంగ్‌జంప్‌ ప్రణీత్‌, బాలికల షాట్‌పుట్‌ సానియా, జావెలిన్‌ త్రో హారిక, అండర్‌–18 బాలుర షాట్‌పుట్‌కు సాయి, లాంగ్‌జంప్‌ శంకర్‌, షాట్‌పుట్కు దశరథ్‌, ట్రిపుల్‌జంప్‌కు మహదీప్‌ ఎంపికయ్యారని డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్‌ కార్యదర్శి బొలమోని కుమార్‌, జబ్బార్‌, దేవేందర్‌, అజయ్‌కుమార్‌, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement