జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు గురువారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 9,533 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ మొత్తం కిక్కిరిసిపోయింది. అలాగే 4,668 బస్తాల మొక్కజొన్న మార్కెట్‌కు వచ్చింది. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,825, కనిష్టంగా రూ.5,069, ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,219,ఽ పొద్దుతిరుగుడు రూ.5,812, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,858, కనిష్టంగా రూ.1,601, జొన్నలు రూ.5,789, రాగులు రూ.2,807 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,381, కనిష్టంగా రూ.2,070, హంస గరిష్టంగా రూ.1,779, కనిష్టంగా రూ.1,619గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


