రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చాలి

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్‌గల్‌: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండలంలోని బండపల్లి, బహుదూర్‌గూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని శుభ్రం చేసి కేంద్రాలకు తీసుకొస్తే తూకం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులు కల్పించాలన్నారు. సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్‌ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అంతకుముందు బండపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు బాలీశ్వరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు హుస్సేనమ్మ, రమాదేవి, ఐకేపీ సిబ్బంది, మండల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement