రోజు రూ.40 చెల్లించే వాడిని | - | Sakshi
Sakshi News home page

రోజు రూ.40 చెల్లించే వాడిని

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

15 ఏళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తున్నా. ఉదయం నుంచి రాత్రి వర కు అమ్ముకోవడం.. అమ్మి న దాంట్లో తైబజార్‌ రూ పంలో రూ.40 పురపాలికకు చెల్లించేవాడిని. కౌన్సిల్‌ నిర్ణయంతో మా లాంటి పేదలకు అదనపు భారం తప్పింది.

– దూల నిరంజన్‌,

కూరగాయల విక్రయదారు

సంతోషంగా ఉంది..

వ్యాపారం సక్రమంగా నడిచినా.. నడవకపోయినా రోజు తైబజార్‌ చెల్లిస్తుండేవాళ్లం. ప్రస్తుత పుర పాలకవర్గం తీసుకున్న నిర్ణయంతో అరకొర ఆదా యం వచ్చే మాలాంటి వారికి కాస్త ఉపశమ నం లభించినట్లయింది. చాలా సంతోషంగా ఉంది. – లక్ష్మి, చిరు వ్యాపారి, కమాన్‌ చౌరస్తా

పేదల కోసమే..

రెక్కాడితేగాని డొక్కాడని పేద వ్యాపారులు తైబజార్‌తో ఇబ్బందులు పడకూడదని భావించాం. కౌన్సిల్‌లో బలమైన వాదనలు వినిపించి అందరు సభ్యులు ఒప్పుకునేలా కృషి చేశాం. మా పార్టీలోని మిగతా సభ్యులు కూడా తైబజార్‌ రద్దుకు సుముఖత వ్యక్తం చేయడంతో చిరు వ్యాపారులకు న్యాయం చేసినట్లయింది.

– ధనలక్ష్మి, కౌన్సిలర్‌

Advertisement
 
Advertisement
Advertisement