పాన్‌గల్: రాష్ట్రంలోని పేదలు సన్న బియ్యంతో భోజనం చేయాలనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారని.. ఇది చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు రేమద్దుల, కిష్టాపూర్‌తండా, గోప్లాపూర్, అన్నారం గ్రామంలోని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీని అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు తక్కువ ధరకు దళారులకు విక్రయించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న రకం బియ్యం పంపిణీని ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో చాలావరకు అమలు చేసిందని.. మిగిలిన వాటిని కూడా నెరవేరుస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు జనాభా ప్రతిపాదికన పంపిణీ చేయనుండగా, 69 ఓట్లకు ఒక ఇల్లు చొప్పున మంజూరు అవుతాయన్నారు. మొదటి విడతలో రాని వారికి రెండోవిడతలో మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా.. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, తప్పులు చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, మండల కాంగ్రెస్ నాయకులు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌పార్టీ కార్యాలయ నిర్మాణ
స్థల పరిశీలన..
వనపర్తి: జిల్లాకేంద్రంలోని రాజపేట శివారులో కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికిగాను శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి స్థల పరిశీలన చేశారు. ఎకరా స్థలంలో కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు మేఘారెడ్డి తెలిపారు. స్థలం నిర్మాణానికి అనువుగా ఉందని.. వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి చెప్పారు. భవన నిర్మాణం పూర్తయితే కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.
జనాభా ప్రాతిపదికన
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు