
నిజాయితీ చాటుకున్న 108 వాహన సిబ్బంది
పాన్‌గల్: అంబులెన్స్ సిబ్బంది నిజాయితీ చాటుకొని ప్రమాద స్థలంలో దొరికిన నగదును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన కురుమూర్తి బుధవారం బైక్‌పై మెట్టుపల్లికి వెళ్తుండగా దావాజిపల్లి స్టేజీ సమీపంలో వనపర్తి నుంచి పాన్‌గల్ వైపు వస్తున్న భాస్కర్‌రెడ్డి బైక్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరికీ గాయలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కురుమూర్తి దగ్గర ఉన్న రూ.47,500ను ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఈఎంటీ విజయ్, పైలెట్ ఎల్లస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.