వనపర్తి రూరల్: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదని ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అనుబంధం ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ.. మార్చి 24న హైదరాబాద్‌లోని కోఠి కమిషనర్ కార్యాలయం ఎదుట జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు జరిగినప్పుడు పరిష్కరిస్తే ప్రభుత్వానికి భవిష్యత్ ఉంటుందని.. కాదు కూడదని నిర్బంధం ప్రయోగిస్తే చరిత్రలో ఏ ప్రభుత్వం మిగలదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు భాగ్యమ్మ, సునీత, చంద్రకళ, చిట్టెమ్మ, శివమ్మ, రాధ, వినీల, నారాయణమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.