అమరచింత: చంద్రగఢ్ కోట చరిత్రను అధ్యయనం చేసి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ప్రాచీన చంద్రగఢ్ కోటను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. కోట లోపల ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాతి కొలనులు, కోటను పరిశీలించి మాట్లాడారు. కోట, ఆలయ ప్రాచుర్యం, చరిత్రను వెలికి తీసేందుకు కృషి చేస్తామని.. కోట వద్ద మౌలిక సౌకర్యాల కల్పనకు ముందస్తుగా రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ నిధులతో కోటపై భాగానికి వెళ్లడానికి సీసీ రహదారి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉందని.. అక్కడి పర్యాటకులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కోటను చూడటానికి వస్తుంటారని, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పురావస్తుశాఖ అధికారులను పంపించి చరిత్రను గుర్తించి కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్, ఎస్‌ఐ సురేశ్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పరమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి..
ఆత్మకూర్: గత పాలకుల నిర్లక్ష్యంతోనే పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని పరమేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే డా. వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పరమేశ్వరస్వామి ఆలయ చరిత్ర ఎంతో ఘనమైందని.. ఆలయంతో పాటు చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని, ఇందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాంద్‌పాషా, నాయకులు రహ్మతుల్లా, గంగాధర్‌గౌడ్, పరమేశ్, తులసిరాజ్, శ్రీను, సాయిరాఘవ, యాదగిరిశెట్టి, తెలుగు నాగేష్, మశ్ఛందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాత్కాలిక మరమ్మతులకు రూ.25 లక్షలు మంజూరు
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు