
రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్ర కూటుల ఆనవాళ్లు
ఖిల్లాఘనపురం: మండలంలోని సల్కెలాపురం రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్రకూటుల కాలపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు డా. శివనాగిరెడ్డి తెలిపారు. ఆలయ చైర్మన్ తూము బుచ్చారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ఆయన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో సుమారు 1,200 ఏళ్లనాటి చరిత్ర కలిగిన రాష్ట్రకూటుల స్తంభాన్ని, దానిపై చెక్కిన శిల్పాలను గుర్తించినట్లు తెలిపారు. దీని ఆధారంగా గ్రామంలో నాడే ఆలయం నిర్మించినట్లు తెలుస్తుందన్నారు. ఆల యం చుట్టూ నాటి వీరుల శిల్పాలు ఉన్నాయని.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్తంభాన్ని, శిల్పాలను సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు.