అప్పటిలో త్వరితగతిన చర్యలు...
● బంగ్లాదేశ్ బలగాలకు చిక్కిన
9 మంది మత్స్యకారులు
● మూడునెలలవుతున్నా పట్టించుకోని చంద్రబాబు సర్కార్
● తమ వారు ఎప్పుడు వస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్న మత్య్సకార కుటుంబాలు
● ఆయా కుటుంబాల్లో కనిపించని
సంక్రాంతి వెలుగులు
● వైఎస్సార్‌సీపీ హయాంలో
పాకిస్తాన్‌లో చిక్కుకున్న
మత్య్సకారులకు విముక్తి
● నా కొడుకును చూసి మూడునెలలైంది
నా పేరు మారుపల్లి ఎల్లయ్యమ్మ. మాది కూడా కొండరాజులేం గ్రామం. నా కొడుకు రమేష్ చేపలవేట కోసం మరో 8 మందితో కలిసి వెళ్లాడు. ఎప్పుడు చేపలవేటకు వెళ్లినా 15 నుంచి 20 రోజుల్లోగా ఇంటికి వచ్చేస్తారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకు పోవడం వల్ల అక్కడ జైల్లో బందీ అయ్యాడు. అక్కడ ఏలా ఉన్నాడో, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడో తెలియదు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. సంక్రాంతి పండగకు అయినా నా కొడుకు వస్డాడని అనుకున్నాం. బిడ్డను చూసి మూడునెలలవుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని మా మత్య్సకార బిడ్డలను విడిపించాలి.
● ప్రసవ సమయంలో బందీగా భర్త
నా పేరు సూరాడ అనిత. భోగాపురం మండలంలోని కొండరాజుపాలేం. నేను ఆరు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు మా ఆయన అప్పలకొండ విశాఖపట్నం షిపింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లాడు. ప్రసవ సమయానికి వచ్చేస్తానని చెప్పాడు. సంద్రంలో బోటు మరమ్మతులకు గురై బంగ్లా జలాల్లోకి వెళ్లడంతో ఆ దేశ రక్షణదళాలకు చిక్కాడు. బందీ అయ్యాడు. ఇప్పుడు మగబిడ్డ పుట్టాడు. భర్త బందీగా ఉండడంతో బిడ్డ పుట్టాడన్న ఆనందం లేకుండా పోయింది. బిడ్డ పుట్టిన విషయం కూడా అతనికి చెప్పే అవకాశం లేదు. ప్రభుత్వం స్పందించి భర్తతో పాటు మిగిలిన మత్స్యకారులను విడిపించాలి. ఆడబిడ్డల గోడును వినిపించుకోవాలి.
విజయనగరం ఫోర్ట్:
చేపలవేటే వారికి జీవనాధారం. నిత్యం సముద్రంలోనే వారి జీనవపోరాటం. ఎప్పటివలే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు దిశ తప్పింది. బంగ్లాదేశ్ జలాల్లోకి చొరబడింది. అంతే.. గతేడాది ఆక్టోబర్ 22వ తేదీన జిల్లాకు చెందిన 9 మంది మత్య్సకారులు అక్కడి రక్షణ దళాలకు చిక్కారు. మూడు నెలలుగా అక్కడి జైలులో బందీలయ్యారు. విపత్తులు, ప్రమాదాల సమయంలో ఇలాంటి ఘటనలు సాధారణమే. ప్రభుత్వం బంగ్లాదేశ్ విదేశాంత శాఖతో మాట్లాడితే విడిపించడం సులభమే. కానీ.. ఆ చర్యలు కానరావడంలేదన్నది మత్స్యకారుల ఆరోపణ. మూడునెలలవుతున్నా పొరుగు దేశంలో బందీలుగా మారిన మత్స్యకారులను విడిపించడంలో చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమవారు ఎప్పడు వస్తారని మత్య్సకార కుటుంబ సభ్యులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి వస్తారని ఆశపడ్డారు. ఆ అవకాశం లేదని తెలియడంతో కన్నీరుపెడుతున్నారు. బంగ్లాదేశ్ జైలులో మత్య్సకారులు ఏలా ఉన్నారో అని బెంగపడుతున్నారు.
బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్య్సకారులు వీరే..
బంగ్లాదేశ్‌లో 9 మంది మత్య్సకారులు చిక్కుకున్నారు. వీరిలో భోగాపురం మండలం కొండరాజుపాలేంకు చెందిన మారుపల్లి చిన్నప్పన్న, మారుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మారుపల్లి ప్రవీణ్, సూరపతి రాము, మారుపల్లి చిన్నప్పన్న, నక్క రమణ, వాసుపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న ఉన్నారు.
మత్య్సకారులను తక్షణమే విడిపించాలి
బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్య్సకారులను తక్షణమే విడిపించాలి. సంక్రాంతి పండగకు అయినా మత్య్సకారులును విడిపిస్తారని అనుకున్నాం. చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదు. మత్య్సకారులను విడిపించే బాధ్యత మాది అని టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మత్య్సకారులను విడిపించాలి. లేని పక్షంలో ఆందోళన చేపడతాం.
– బర్రి చిన్నప్పన్న, జిల్లా మత్య్సకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు
దాయాది దేశం పాకిస్తాన్‌లో చిక్కుకున్న విజయనగరం జిల్లాకు చెందిన మత్య్సకారులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం త్వరితగతిన విడిపించింది. మత్య్సకార కుబుంబ సభ్యులను ఢిల్లీకి తీసుకుని వెళ్లి అక్కడ భోజనం, వసతి కల్పించింది. విమానంలో వారిని జిల్లాకు తీసుకొచ్చింది. విజయవాడలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఒక్కో మత్స్యకారుడికి రూ.5 లక్షల చొప్పన ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. మత్స్యకారులను విడిపించడంలో జిల్లాకు చెందిన అప్పటి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ప్రస్తుత శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అప్పటి నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు విశేషంగా కృషిచేశారు.
అప్పటిలో త్వరితగతిన చర్యలు...
అప్పటిలో త్వరితగతిన చర్యలు...
అప్పటిలో త్వరితగతిన చర్యలు...
అప్పటిలో త్వరితగతిన చర్యలు...


