అప్పట్లో మత్య్సకారులను విడిపించాం
దాయాది (శత్రు)దేశంలో చిక్కుకున్న మత్య్సకారులను అప్పటి కేంద్ర విదేశీవ్యవహారాలశాఖ మంత్రి ద్వారా పాకిస్తాన్ ఎంబసీతో మాట్లాడి మత్య్సకారులను విడిపించాం. మత్య్సకార కుటుంబ సభ్యులు అందరిని ఢిల్లీకి తీసుకుని వెళ్లి అక్కడ భోజనం, వసతి కల్పించాం. వైఎస్సార్‌సీపీ తరఫున అప్పటిముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఒక్కో మత్య్సకారుడికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా అందజేశారు. కూటమికి చెందిన ఎంపీలు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ప్రస్తుతం పట్టించుకోకపోవడం విచారకరం. మత్స్యకార కుటుంబాల ఆవేదనను వినిపించుకోవాలి. వారి ఆర్తనాదాలు ఆలకించి న్యాయం చేయాలి.
– బెల్లాన చంద్రశేఖర్,
మాజీ ఎంపీ, విజయనగరం


