స్మార్ట్‌గా సెటిల్‌ అవుదాం | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా సెటిల్‌ అవుదాం

Jan 13 2026 5:38 AM | Updated on Jan 13 2026 5:38 AM

స్మార

స్మార్ట్‌గా సెటిల్‌ అవుదాం

సెల్‌ఫోన్‌ను వ్యసనాలకు

వినియోగిస్తే భవిష్యత్తు అంధకారమే

విద్యార్థులకు శ్రద్ధ అవసరం

ఎప్పటికప్పుడు గమనించాలి..

సాంకేతిక పరిజ్ఞానం మరింతగా చేరువకావడంతో యువత పక్కదారి పడుతోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌లలో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. వారి మాటలు నమ్ముతూ ప్రేమ పేరుతో యువతులు మోసపోతూ జీవితం నాశనం చేసుకుంటున్నారు. అందుకే పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

– వి.వంశీకృష్ణ, వక్తిత్వ వికాస నిపుణుడు, రాజాం

రాజాం సిటీ: స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు అందరి చేతిలో కనిపిస్తున్న ఏకై క పరికరం. పని ప్రదేశం, ఇల్లు, ప్రయాణాలు ఇలా అన్నిచోట్ల తనదైన ముద్ర వేసుకుని నిత్య జీవితంలో భాగమైంది. దూరం దగ్గరైంది. దగ్గర దూరమైంది. సెల్‌పోన్‌ వినియోగంతో మంచి ఉంది..చెడూ ఉంది.. అందుకే స్మార్ట్‌ ఫోన్‌ను మంచి కోసం వినియోగించుకుందాం. లేదంటే జీవితంలో అంధకారం నెలకొంటుంది. సాంకేతిక వ్యసనం కాలాన్ని కరగదీస్తుంది. సమయం వృథా కావడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా గ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాలకు యువత దాసోహవుతోంది. చివరికి తల్లిదండ్రులతోనూ మాట్లాడలేనంతగా ఫోన్‌తో మమేకం అవుతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు పేర్కొంటున్నారు.

బానిసలు కావద్దు..

స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన యువత చదువుకునేందుకు సమయం వెచ్చించడం లేదు. ఫలితంగా అధ్యాపకులు చెప్పిన పాఠాలు చదివేందుకు సమయం సరిపోక అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేక, జీవితంలో స్థిరపడలేక ఆత్మవిశ్వాసం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడాల్సిన దుస్థితి తెచ్చుకుంటున్నారు.

తల్లిదండ్రుల పాత్ర కీలకం..

పాఠశాలలు, కళాశాలల నుంచి ఇంటికి రాగానే యువత..పుస్తకాలు పక్కన పడేసి సెల్‌ఫోన్‌ చూస్తూ కాలం గడుపుతోంది. దీనిని తల్లిదండ్రులు గమనించాలి. చదువుతోపాటు శారీరక, మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఏకాగ్రత పెంచే యోగా, ధ్యానం అలవాటు చేయాలి. పేదరికం అనుభవిస్తూనే ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించిన పలువురి జీవిత గాథలు వివరించి పిల్లల్లో ప్రేరణ కలిగించాలి.

అందిపుచ్చుకుంటే విజ్ఞానం..

యువత స్మార్ట్‌ఫోన్‌ను సక్రమంగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తమ భవితకు బంగారుబాట వేసుకునేందుకు ఉపకరిస్తుంది. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివే వారికి అన్ని రకాల పాఠ్యాంశాలకు సంబంధించి సమాచారం గూగుల్‌, యూట్యూబ్‌లలో లభిస్తుంది. వీడియో తరగతుల ద్వారా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఫార్ములాలు, కమ్యూనికేషన్స్‌ ిస్కిల్స్‌ అభివృద్ధి చేసుకోవచ్చు. అధ్యాపకులు బోధించిన పాఠ్యాంశాలకు అదనపు సమాచారం సేకరించి పరిజ్ఞానం మెరుగుపర్చుకోవచ్చు.

రేగిడి మండలంలోని కొండవలస గ్రామానికి చెందిన బెవర చూడామణి డిగ్రీ చదువుకుని బ్యాంకు కోచింగ్‌కు వెళ్లాడు. అక్కడ సెల్‌ఫోన్‌లో అవసరమైన సమాచారం సేకరిస్తూ పలు పరీక్షలు రాశాడు. ఫలితాల్లో బెంగళూరు, హైదరాబాద్‌లలో బ్యాంకు పీఓగా ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచాడు.

రాజాం మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలసకు చెందిన పాలవలస భాస్కరరావు సెల్‌ఫోన్‌ను సద్వినియోగం చేసుకుని ఇటీవల పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షలో స్టేట్‌ 9వ ర్యాంకు సాఽధించాడు.

చూడామణి, భాస్కరరావుల మాదిరిగా యువత ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను సద్వినియోగం చేసుకుంటే లక్ష్యాలను సాధించవచ్చు.

స్మార్ట్‌గా సెటిల్‌ అవుదాం1
1/2

స్మార్ట్‌గా సెటిల్‌ అవుదాం

స్మార్ట్‌గా సెటిల్‌ అవుదాం2
2/2

స్మార్ట్‌గా సెటిల్‌ అవుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement