వేడుకగా విజయభావన వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా విజయభావన వార్షికోత్సవం

Mar 31 2025 11:09 AM | Updated on Mar 31 2025 11:09 AM

వేడుక

వేడుకగా విజయభావన వార్షికోత్సవం

● అబ్బురపరిచిన పి.రాజేశ్వరరావు చిత్ర కళాప్రదర్శన ● ఆలోచింపజేసిన వాణీవిలాసం ● చలనచిత్ర నటులు డాక్టర్‌ అక్కిరాజుకు ఉగాది పురస్కారం

విజయనగరం టౌన్‌: సాహితీ సంస్థలకు తమ వంతు తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు. స్థ్దానిక లయన్స్‌ కమ్యూనిటీ హాల్‌లో విజయభావన సాహితీమిత్ర సమాఖ్య 40వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యల నగరమైన విజయనగరంలో సంగీత సాహిత్యాలు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చలనచిత్ర నటులు, కవి డాక్టర్‌ అక్కిరాజు సుందర రామకృష్ణ (హైదరాబాద్‌)ను దుశ్శాలువ, జ్ఞాపిక, నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. విజయనగరం గడ్డపై విజయభావన సంస్థ అందించిన పురస్కారంతో తనకెంతో ఆనందంగా ఉందని, విజయనగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ముందు ఉదయం సభ కార్యక్రమాన్ని ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణురాలు డాక్టర్‌ జి.సన్యాసమ్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ధవళ సర్వేశ్వరరావు, డాక్టర్‌ ఎ.గోపాలరావుల నేత్రత్వంలో నిర్వహించిన వాణీవిలాసంలో కవులు తమ కవితాగానాలాపన చేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు, లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు గ్రహీత పండూరు రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన ఆద్యంతం చూపరులను ఆకట్టుకుంది. డాక్టర్‌ భైరవభట్ల విజయాదిత్య ఏకపాత్రాభినయం, ఇబ్రహీంఖాన్‌ నాట్య ప్రదర్శన రక్తికట్టించింది. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎ.గోపాలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో సమాఖ్య ప్రతినిధులు భోగరాజు సూర్యలక్ష్మి, బాబూజీరావు, డాక్టర్‌ జక్కు రామకృష్ణ, ఇఆర్‌.సోమయాజులు, వై.బాబూరావు, ఎం.అనిల్‌ కుమార పువ్వాడ వెంకట భాస్కర్‌, కాపుగంటి ప్రకాష్‌, దుర్గాప్రాద్‌, రఘోత్తమాచార్య, బవిరెడ్డి శివప్రసాదరెడ్డి, శ్రీరామబాబా అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.

వేడుకగా విజయభావన వార్షికోత్సవం 1
1/1

వేడుకగా విజయభావన వార్షికోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement