విజయనగరం అర్బన్: ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తాగునీటి బోరుబావులన్నింటినీ వినియోగంలోకి తేవాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి శనివారం మండల ప్రత్యేకాధికారులు మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ఆరా తీయాలన్నారు. తాగునీటి సమస్యపై కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 73825 63040ను అందుబాటులో ఉంచాలన్నారు. పశువులకు పశుగ్రాసం సమస్య తలెత్తకుండా చూడాలని పశుసంవర్థక శాఖ జేడీకు సూచించారు.
ఉపాధి వేతనదారులకు పని గంటలు మార్చాలి
ఉపాధి హామీ పనులు చేసే వేతనదారులు వేసవి తాపానికి గురికాకుండా పనివేళలను మార్చాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఉదయం 6.30 నుంచి 9.30 గంటల లోపు, సాయంత్రం 5 నుంచి 7గంటలలోపు పని వేళలు ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 30, 31వ తేదీల్లో పబ్లిక్ సెలవులు కారణంగా 1వ తేదీన ఇచ్చే పింఛన్ సొమ్మును ఈ నెల 29వ తేదీనే విత్‌డ్రా చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, జిల్లా అధికారులు, నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు.
పీ–4కు ప్రత్యేక బస్సులు
విజయవాడలో ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న పీ 4 కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యేలా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 7 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధిహామీ వేతనదారులు, స్వయం శక్తి సంఘాల ప్రతినిధులు, రైతులను అన్ని నియోజకవర్గాల నుంచి బస్సుకు 50 మంది చొప్పున పంపించాలని అధికారులకు సూచించారు. ప్రతి బస్సులో పోలీస్ కానిస్టేబుల్, ఏఎన్‌ఎంను ఉంచాలని, ఒక లైజనింగ్ అధికారిని నియమంచాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, ఎఎప్పీ సౌమ్యలత, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, సీపీఓ పి.బాలాజీ, డీటీసీ మణికుమార్, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో ప్రతి రెండు గంటలకు వాటర్ బెల్
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్


