● వెల్ఫేర్‌డేలో విజ్ఙాపనలు స్వీకరించిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించనున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డేను ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ విజ్ఞాపనలు స్వీకరించి చర్యలు చేపట్టారు.
లివిరి సమీపంలో ఏనుగుల గుంపు
భామిని: మండలంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం మండలంలోని లివిరి పంట పొలాల్లో నాలుగు ఏనుగుల గుంపు ప్రవేశించి పంటలు నాఽశనం చేస్తున్నాయి. వంఽశదార నదీ తీరం వెంబడి ఏనుగుల గుంపు ప్రయాణం కొనసాగుతోంది. భామిని గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశిస్తుందని మండల కేంద్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఏనుగులు గుంపు పంటలన్నీ పాడుచేస్తున్నప్పటికీ అధికార కూటమి నాయకులు ఇచ్చిన హామీ మరిచి మౌనం వహించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహిళ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: నగర శివారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మపురిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ శుక్రవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధర్మపురికి చెందిన సేనాపతి ఆదిలక్ష్మి (40) కొన్నేళ్లుగా తనకు పెళ్లి కావడంలేదని కుంగిపోయింది. ఇంట్లో తనతో పాటు కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు 40 ఏళ్లకే అకాల మరణం చెందారు. వాళ్లకు కూడా పెళ్లికాక మనోవేదనతో అకాలమృతి కావడంతో ఆదిలక్ష్మి మనస్తాపానికి గురైంది. రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు లేక ముగ్గురు అన్నల్లో ఒక అన్నావదిన దగ్గర ఉంటూ అన్నయ్య పిల్లలతోనే కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో వదిన కూడా తరచూ నీకు ఇంకా పెళ్లి కాలేదని మాటలతో వేధించసాగింది. అటు బయటకూడా స్నేహితులు, చుట్టుపక్కల వారు ఆదిలక్ష్మికి ఇంకా పెళ్లి కాలేదని గుసగుసలాడుకోవడం మరింతగా కంగదీసింది. ఈ క్ర మంలో గురువారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పుడే ఆమె వదిన హుటాహుటిన నగరంలోని మహరాజా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా శుక్రవారం చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో వదిన నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రెండు బైక్‌లు ఢీకొని
యువకుడి మృతి
వేపాడ: మండలంలోని కొత్త బొద్దాం జంక్షన్‌లో గురువారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు ద్విచక్రవాహనం వెళ్తుండగా ఎల్.కోట నుంచి ఎస్.కోట వైపు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం కొత్త బొద్దాం జంక్షన్ దగ్గర ఢీకొన్నాయి. దీంతో ప్రమాదంలో రెండు వాహానాలపై ఉన్న ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు వెళ్తున్న వాహనచోదకుడు బసవబోయిన కార్తీక్ (19) మృతిచెందాడు. ఎస్.కోట కోటవీధికి చెందిన కార్తీక్‌కు తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.దేవి తెలిపారు.
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఒకరోజు
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఒకరోజు


