● ఆనందాల సాగరం | - | Sakshi
Sakshi News home page

● ఆనందాల సాగరం

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు సముద్ర తీరం ఒక చల్లని చిరునామాగా మారింది. వారాంతం కావడంతో ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు సాగర తీరానికి పోటెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా కనిపించారు. కొందరు సముద్రంలో స్నానాలు చేయగా.. చిన్నారులు అలలతో ఆటలాడుతూ మురిసిపోయారు. యువత సెల్ఫీలు దిగుతూ, ఇసుక తిన్నెలపై కూర్చుని స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకుంటూ సందడి చేశారు.

– ఏయూక్యాంపస్‌/సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement
 
Advertisement
Advertisement