మిగతా IIవ పేజీలో
విశాఖలో భూదోపిడీని ఎండగడుదాం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
పార్టీ వెంటే ఉన్న కార్పొరేటర్లకు మళ్లీ పోటీ చేసే అవకాశం
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటగా చెబుతున్నా..
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ నగరాన్ని వేదికగా చేసుకుని కూటమి నేతలు సాగిస్తున్న భూఆక్రమణలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల ఆత్మీయ సత్కారం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జగనన్న మాట.. మీకే మా భరోసా!
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రా నున్న జీవీఎంసీ ఎన్ని కల్లో పార్టీ వెంటే ఉన్న కార్పొరేటర్లకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటగా హామీ ఇచ్చారు. ‘మీరు ఎక్స్ కార్పొరేటర్లు కాదు.. నెక్ట్స్ కార్పొరేటర్లు‘ అని ఉత్సాహపరిచారు. విలువులు, విశ్వసనీయతతో పనిచేసేవారే మన నాయకుడికి ఇష్టమని, ఆ బాటలోనే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
విశాఖలో భూదోపిడీపై ఉద్యమించాలి: కేకే రాజు
వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తు త కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూదోపిడీని ప్రజలకు వివరించాలని జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తేవాలని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్సార్‌సీపీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అభివృద్ధి శూన్యం: వరుదు కల్యాణి
ఏడాది కాలంగా కూ టమి నేతలు కుట్రలు చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారే తప్ప, నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్సీ


