ఉగాది ఉషస్సు | - | Sakshi
Sakshi News home page

ఉగాది ఉషస్సు

Mar 19 2026 7:28 AM | Updated on Mar 19 2026 7:28 AM

లేలేత మామిడి ఆకుల తోరణాలు, వీనుల విందు చేసే కోకిలమ్మ కుహు కుహు రాగాలు, గాలితో పాటే వస్తున్న వేప పువ్వు సుగంధాలు.. వెరసిప్రకృతి కాంత పచ్చని పట్టుచీర కట్టి ముస్తాబైన వేళ.. తెలుగులోగిళ్లలోకి చిరునవ్వులతో అడుగుపెడుతున్న తొలి పండగ ఉగాది. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం... ఈ ఆరు రుచుల కలయికతో సిద్ధమయ్యే ఉగాది పచ్చడి.. జీవితం అంటే కేవలం ఆనందమే కాదు కష్టసుఖాల, భావోద్వేగాల సమ్మేళనం అనే గొప్ప జీవన సత్యాన్ని మనకు బోధిస్తుంది. గడిచిన కాలంలోని చేదు జ్ఞాపకాలను వదిలేసి, కొత్త ఆశలు, మధురమైన స్వప్నాలతో సరికొత్త అడుగులు వేస్తూ.. ఈ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. –ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement