విశాఖ లీగల్: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విశాఖకు చెందిన ఐదుగురు న్యాయవాదులు విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు. బుధవారం ఎన్నికలు లెక్కింపు పూర్తయింది. నగరానికి చెందిన సీనియర్ న్యాయవాదులు కె.రామజోగేశ్వరరావు, బి.వి.ఆర్.మూర్తి (బాబు) ఎస్ కృష్ణమోహన్, మహిళా న్యాయవాదుల విభాగంలో డి.మంజులత, కె.నాగశ్రీలు విజయం సాధించారు. వీరికి విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు సీనియర్ న్యాయవాదులు ఎస్.శ్రీనివాసు మూర్తి, నమ్మి సన్యాసిరావు యాదవ్ తదితరులు అభినందించారు.
డి.మంజులత
కె. నాగశ్రీ


