ముగిసిన ఎకై ్సజ్‌ పోలీసుల క్రీడలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎకై ్సజ్‌ పోలీసుల క్రీడలు

Mar 19 2026 7:27 AM | Updated on Mar 19 2026 7:27 AM

మధురవాడ: కొమ్మాదిలోని శాప్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ పోలీసులకు మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు, ఎంపికలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన సుమారు 150 మంది ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా, పురుష, వెటరన్‌ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే నెలలో అమరావతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా విజేతలకు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ విశాఖ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీరామచంద్రమూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement