కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందంతో జీవించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆకాంక్షించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, ఆర్థికంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నారు. జిల్లా పారిశ్రామికంగా, సామాజికంగా మరింత పురోగతి సాధించాలని, స్వర్ణాంధ్ర–2047 సాధనలో ముందంజలో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో గురువారం జరిగే ఉగాది వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


