మధురవాడ జోన్‌లో రికార్డు స్థాయిలో వసూలు
మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోన్‌కు బుధవారం రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఎన్‌సీసీ వైజాగ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రెవెన్యూ అధికారులు రూ.10,01,88,000 వీఎల్‌టీ పన్నును వసూలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ అధికారి నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో ఆర్‌ఐలు సుభానీ, ప్రదీప్‌రెడ్డి తదితరులు ఆ సంస్థ నుంచి పన్ను వసూలు చేసి, ఆ చెక్కును జోనల్ కార్యాలయంలో జెడ్సీ అయ్యప్పనాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా పన్ను వసూలు చేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని జెడ్సీ అభినందించారు.


