మహారాణిపేట: సీనియర్ పాత్రికేయుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకుడు గంట్ల శ్రీనుబాబుకు ప్రతిష్టాత్మకమైన పరాభవనామ ఉగాది పురస్కారం లభించింది. జర్నలిజం, సేవా రంగంలో ఆయన చేస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రముఖులు చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు జర్నలిస్టులు అభినందించారు.


