ఐటీఐలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

Mar 18 2026 7:34 AM | Updated on Mar 18 2026 7:34 AM

మహారాణిపేట : కంచరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌ను కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ ల్యాబ్‌ ఏర్పాటుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఈ నిధులతో కళాశాలలో 25 కంప్యూటర్లు, 25 కుర్చీలు ఏర్పాటు చేసి, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలతో ల్యాబ్‌ను అభివృద్ధి చేశారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే వేసవి శిక్షణా శిబిరాలను కూడా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ రీజనల్‌ హెడ్‌ సీహెచ్‌ పవన్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీ రమణారావు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement