గ్యాస్‌ గోస | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ గోస

Mar 18 2026 7:34 AM | Updated on Mar 18 2026 7:34 AM

● జేసీ విద్యాధరి

గ్యాస్‌ కొరత లేదు

మహారాణిపేట: జిల్లాలో వంట గ్యాస్‌, వాణిజ్య గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. రోజుకు సుమారు 18 వేల గ్యాస్‌ సిలెండర్లు సరఫరా చేస్తున్నామని, రాబోయే రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. అనధికార గ్యాస్‌ విక్రయాలు లేదా గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్‌ సరఫరా, డిమాండ్‌పై నిరంతరం సమీక్ష చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 50 వేల మంది వంట గ్యాస్‌ కోసం బుకింగ్‌లు చేసుకున్నారని, ఎక్కడ గ్యాస్‌ కొరత లేదని తెలిపారు. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఔషధ పరిశ్రమకు చెందిన సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి వంట గ్యాస్‌ను సరఫరా చేస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement